జగన్, కేసీఆర్ భేటీ.. చర్చించే అంశాలివేనా?

జగన్, కేసీఆర్ భేటీ.. చర్చించే అంశాలివేనా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్ కు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం వైయస్ జగన్ జనవరి 13న...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్ కు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా సీఎం వైయస్ జగన్ జనవరి 13న ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేకర్ రావుతో సమావేశం కానున్నారు. సమావేశంలో, ఇరువురు నాయకులు విభజన చట్టం మరియు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర దీర్ఘకాల సమస్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల విభజన, గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతకుముందు, సీఎంలు ఇద్దరూ గోదావరి మరియు కృష్ణానది ప్రాజెక్టు అనుసంధానంపై ప్రాథమిక చర్చలు జరిపారు.

ఈ సమావేశంలో దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పటికే రెండుసార్లు సమావేశమై రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలు , వాటి పరిష్కారంపై చర్చించారు. వాస్తవానికి గోదావరి మిగులు మిగులు జలాలను వాడుకునేందుకు వీలుగా తెలంగాణలో ప్రాజెక్టు కట్టాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదించారు. కానీ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గారు. తెలంగాణతో సంబంధం లేకుండా ప్రాజెక్టును నిర్మించుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే పోలవరం–బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ (బీసీఆర్‌) అనుసంధానం పనులను రాబోయే నాలుగేళ్లలోగా పూర్తిచేయాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ప్రస్తుతం పోలవరం కుడి కాలువ ప్రస్తుత సామర్థ్యం 17,633 క్యూసెక్కులుగా ఉంది.. అయితే దీన్ని మరో 23,144 క్యూసెక్కుల (రెండు టీఎంసీలు)కు పెంచి. మొత్తం 40,777 క్యూసెక్కుల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు. అక్కడినుంచి ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం మీదుగా రెండు టీఎంసీలను నాగార్జునసాగర్‌ కుడి కాలువలో 80 కి.మీ వద్దకు పంపింగ్ చేస్తారు. పెదకూరపాడు నియోజకవర్గం బొల్లాపల్లి వద్ద 150 నుంచి 200 టీఎంసీల సామర్థ్యంతో ఏర్పాటు చేసే రిజర్వాయర్‌ కు తరలిస్తారు.

గుంటూరు జిల్లాలో అవసరమైన ప్రాంతాలకు పిల్ల కాలువల ద్వారా పంపించి.. అలాగే బొల్లాపల్లి నుంచి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ప్రకాశం ఆయకట్టుకు నీటిని అందిస్తూనే.. నల్లమల అడవుల్లో సుమారు 20 కి.మీ నుంచి 25 కి.మీల పొడవున సొరంగం ద్వారా బీసీఆర్‌లోకి గోదావరి జలాలను తరలిస్తారు. అక్కడ నుంచి గోదావరి నీటిని గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు సరఫరా చేసేలా డీపీఆర్‌ను తయారు చేయించారు జగన్. దీనిపై త్వరలోనే క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే విషయాన్నీ తెలంగాణ సీఎంకు చెప్పి మేము మీతో కలవలేము అని స్పష్టం చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories