రాజమండ్రిలో దారుణ ఘటన.. కానిస్టేబుల్‌పై కత్తులపై దాడి

రాజమండ్రిలో దారుణ ఘటన.. కానిస్టేబుల్‌పై కత్తులపై దాడి
x
Highlights

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌పై యువకులు దాడి చేశారు. అనంతరం కత్తులతో వీరంగా సృష్టించారు....

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌పై యువకులు దాడి చేశారు. అనంతరం కత్తులతో వీరంగా సృష్టించారు. బాధితుడు సీతానగరం, కోరుకొండ పోలీస్‌ స్టేషన్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావుగా గుర్తించారు. నాగేశ్వరరావు మోటారు సైకిల్‌పై వెళ్తుండగా ఆనంద్‌ నగర్‌ ఆటో స్టాండ్‌ వద్దకు రాగానే వెనుక నుంచి మోటారు సైకిల్‌పై వచ్చిన ముగ్గరు యువకులు కానిస్టేబుల్ మైటారు సైకిల్‌ను ఢీ కొట్టారు. దీంతో వారిని ప్రశ్నించారు ఆ కానిస్టేబుల్.. అయితే ఆ యువకులు అతనిపై తీవ్ర వాగ్వివాదానికి దిగారు.

అంతేకాదు హెడ్‌ కానిస్టేబుల్‌ పై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. కత్తులతో దాడి చేసినట్టు కానిస్టేబుల్ వెల్లడించారు. భయబ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో త్రీటౌన్‌​ పోలీసులు అక్కడికి చేరకుని ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన యువకులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డ కానిస్టేబుల్‌కు చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories