అనంతపురం యువతి కిడ్నాప్ కథ సుఖాంతం

అనంతపురం యువతి కిడ్నాప్ కథ సుఖాంతం
x
Highlights

అనంతపురం జిల్లా ఆజాద్‌‌‌నగర్‌లో కిడ్నాప్‌కి గురైన యువతి కేసును పోలీసులు ఛేదించారు. జ్యోతిని కిడ్నాప్‌ చేసిన కానిస్టేబుల్‌ భగీరథను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురం జిల్లా ఆజాద్‌‌‌నగర్‌లో కిడ్నాప్‌కి గురైన యువతి కేసును పోలీసులు ఛేదించారు. జ్యోతిని కిడ్నాప్‌ చేసిన కానిస్టేబుల్‌ భగీరథను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం తల్లితో కలిసి బయటకు వెళ్లిన జ్యోతిని.. కొంతమంది గుర్తు తెలియని దుండగులు స్కార్పియోలో ఎత్తుకెళ్లారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి.. 24గంటల్లోనే ఛేదించారు. కిడ్నాప్‌కు గురైన యువతిని, కిడ్నాప్ చేసిన భగీరధను బనగానపల్లె పీఎస్‌కు తరలించారు. కిడ్నాప్ హైడ్రామాపై సమగ్ర విచారణ కొనసాగుతోందని డీఎస్పీ వీర రాఘవ రెడ్డి తెలిపారు. జ్యోతి క్షేమంగా ఉందన్న సమాచారంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories