logo

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యాయత్నం
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ యువతి. కాకినాడ...

తూర్పుగోదావరి జిల్లాలో పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ యువతి. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ముందు ఘటన చోటు చేసుకుంది. తునికి చెందిన నవీన్ అనే యువకుడిని నాలుగేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ననీన్ పై ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల వారితో మాట్లాడుతున్న సమయంలోనే స్టేషన్ ముందు యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని పోలీసులు, కుటుంబ సభ్యులు జీజీహెచ్ కు తరలించారు.లైవ్ టీవి


Share it
Top