ప్రియురాలితో పెళ్లి జరిపించలేదని టవరెక్కిన యువకుడు

ప్రియురాలితో పెళ్లి జరిపించలేదని టవరెక్కిన యువకుడు
x
Highlights

ప్రియురాలితో పెళ్లి జరిపించలేదని ఓ యువకుడు సెల్ టవరెక్కి ఎక్కాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. కొంగరెడ్డిపల్లెకు చెందిన...

ప్రియురాలితో పెళ్లి జరిపించలేదని ఓ యువకుడు సెల్ టవరెక్కి ఎక్కాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. కొంగరెడ్డిపల్లెకు చెందిన వినోద్‌ అనే యువకుడు అదేప్రాంతానికి చెందిన ఓ యువతి కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్ళికి పెద్దలు నిరాకరించారు. దాంతో సదరు యువతితో పెళ్లి చేయడం లేదని వినోద్ ఆమెను తన ఇంటికి రమ్మన్నాడు. ఈ నేపథ్యంలో ప్రియురాలు.. వినోద్ ఇంటికి చేరుకుంది. అయితే కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన యువతి తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లిపోయారు. మనస్థాపానికి గురైన వినోద్ ప్రియురాలితో పెళ్ళిచేయకుంటే సెల్‌ టవర్‌ ఎక్కి దూకుతానని నిజంగానే ఎక్కి బెదిరించసాగాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వినోద్ కు నచ్చజెప్పి కిందకు దించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories