యువతి ఆత్మహత్యా యత్నం... ఏపీ మంత్రి ఇంటివద్ద కలకలం

యువతి ఆత్మహత్యా యత్నం... ఏపీ మంత్రి ఇంటివద్ద కలకలం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

యువతి ఆత్మహత్యా యత్నం... ఏపీ మంత్రి ఇంటివద్ద కలకలం యువతి ఆత్మహత్యా యత్నం... ఏపీ మంత్రి ఇంటివద్ద కలకలం

కుటుంబ కలహాల నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ ఏపీ మంత్రికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్న కారణంతో ఓ యువతి మనస్తాపం చెందింది. మంత్రి ఇంటి ముందు ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపోతోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువతికి కొంతకాలంగా కుటుంబ సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తన బాధను చెప్పుకునేందుకు ఆ యువతి పలుమార్లు మంత్రి వద్దకు వచ్చినట్టు సమాచారం. అయితే ఇవాళ ఆమె హఠాత్తుగా పురుగుల మందు తాగినట్టు తెలుస్తోంది. దాంతో అక్కడి వారు షాకయ్యారు. వెంటనే ఆమెకు ప్రథమచికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే యువతి ఆత్మహత్యా యత్నం చేసిన సమయంలో మంత్రి ఇంట్లో లేనట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories