అంగవైకల్యానికి వ్యాయామమే ఔషధం

అంగవైకల్యానికి వ్యాయామమే ఔషధం
x
ఉపాధ్యాయునీలు జబీన్ తాజ్, రాధిక, పాఠశాలలో ఉపాధ్యాయ సిబ్బంది, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు
Highlights

అంగవైకల్యం నుంచి విముక్తి పొందాలంటే వ్యాయామానికి మించిన ఔషధం లేదని మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ఉపాధ్యాయునీలు జబీన్ తాజ్, రాధికలు పేర్కొన్నారు.

నల్లమాడ: అంగవైకల్యం నుంచి విముక్తి పొందాలంటే వ్యాయామానికి మించిన ఔషధం లేదని మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ఉపాధ్యాయునీలు జబీన్ తాజ్, రాధికలు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న కేంద్రంలో దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఐఈఆర్ఐ లు మాట్లాడుతూ పిల్లల అంగవైకల్యాన్ని అధిగమించాలంటే ముందుగా వ్యాయామం ముఖ్యమని పేర్కొన్నారు.

ప్రతి బుధవారం భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ ద్వారా చూపే వ్యాయామాలను ఇళ్లలో క్రమం తప్పకుండా చేయడం వల్ల అంగవైకల్యం నుండి విముక్తి పొందవచ్చన్నారు. అంగవైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా వారితో ప్రేమగా వ్యవహరిస్తూ ఉండాలన్నారు. అంగవైకల్యం ఉన్న వారు సమాజంలో చాలా రంగాల్లో రాణిస్తున్నారు అన్న విషయాలను పిల్లలతో చర్చిస్తూ వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలన్నారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులకు భవిత కేంద్రం నుంచి అందజేస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ దినకర్, ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories