చంద్రబాబు కంచుకోట బద్దలు.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా

YCP Won in Kuppam Municipal Elections
x
వైసీపీ (ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights

Kuppam: 13వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం.. ఒక చోట టీడీపీ గెలుపు

Kuppam: కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. ఏకపక్షంగా కుప్పం మున్సిపాల్టీని గెలుచుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం 25 వార్డులు ఉండగా 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం కావడంతో మిగిలిన 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన 24 వార్డుల్లో ఇప్పటి వరకు వైసీపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. తొలి రౌండ్‌లో మొత్తం 14 స్థానాలకు కౌంటింగ్ జరిగింది. ఇక కుప్పం మున్సిపాల్టీ పైన వైసీపీ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది.

కుప్పంలో మొత్తం 25 స్థానాలు ఉండగా. 13 స్థానాలు గెలిచిన పార్టీ ఛైర్మన్ పీఠం దక్కించుకుంటుంది. ఇప్పటికే వైసీపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. అయిదో వార్డులో టీడీపీ విజయం సాధించింది. ఇక రెండో రౌండ్‌లో 15వ వార్డు నుంచి 25వ వార్డు వరకు కౌంటింగ్ జరగనుంది. తొలి నుంచి వైసీపీ ముఖ్య నేతలు చంద్రబాబు కంచుకోటను బద్దలు చస్తామని చెబుతూ వచ్చారు. ఆ పార్టీ అనుకునట్టే అనూహ్య‌, సంచ‌ల‌న విజ‌యాల‌ను వైసీపీ న‌మోదు చేసుకుంటోంది.

కుప్పం మున్సిపల్ ఎన్నికలను అధికార వైసీపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో అక్కడ పాగా వేయాలని వైసీపీ అనేక ప్రయత్నాలు చేసింది. ప్రచారం నుంచి ఓటింగ్ వరకు రెండు పార్టీలు హోరాహోరీగా వ్యవహరించాయి. తాజా ఫ‌లితాల‌పై వైసీపీలో ఉత్సాహం ఉర‌క‌లేస్తుండ‌గా, టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశ‌కు గురవుతున్నాయి. మొత్తానికి కుప్పం ఎన్నికల ఫలితాలు టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చింద‌ని చెప్పొచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories