వైసీపీ గేట్లు తెరవబోతోందా?

వైసీపీ గేట్లు తెరవబోతోందా?
x
Highlights

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే సూత్రాన్ని వైసీపీ పాటిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ ఆకర్ష్ కు తెరలేపింది. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో...

చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే సూత్రాన్ని వైసీపీ పాటిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ ఆకర్ష్ కు తెరలేపింది. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీతో పాటు ఇతర పార్టీల స్థానిక నేతలపై కన్నేసింది. ప్రతిపక్షాల రెండో శ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. ఏపీలో వార్డు మెంబర్ నుంచి జెడ్పీ దాకా, కౌన్సిలర్ నుంచి మున్సిపల్ ఛైర్మెన్ దాకా అన్ని స్థానాలు గెలుచుకోవాలని అధికార వైసీపీ వ్యూహాలు రూపొదిస్తుంది. ఇందులో భాగంగా విపక్షాల రెండో శ్రేణి నాయకులపై వల వేస్తోంది. విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి ప్రారంభమయ్యాయి.

వైసీపీ ఆకర్ష్ విశాఖ జిల్లా నుంచి మొదలైంది. విశాఖ డైయిరీ ఛైర్మన్ అడారి తులసీ రావు కుమారుడు అడారి ఆనంద్, కూతురు రమాకుమారితో ఇతర నాయకులు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జగన్ పాలన బాగుందని, పేదలు, అన్నదాతల సంక్షేమానికి కృషి చేస్తుండడంతో వైసీపీలో చేరినట్లు చెప్పారు. త్వరలో టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ వలసలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు, లోకేష్ ల తీరు మారకపోవడంతో టీడీపీ నేతలు విసుగుచెందుతున్నారని చెప్పారు. పలువురు టీడీపీ నేతలు వైసీపీతో టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు. విశాఖ జిల్లా మాదిరిగానే ఇతర జిల్లాల్లో టీడీపీ పరిస్థితి వుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించే కొద్ది వైసీపీ ఆకర్ష్ వేగం కానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories