అధికారం దక్కినా.. వైసీపీ అధికార ప్రతినిధులు అసంతృప్తిగా ఉన్నారా?

అధికారం దక్కినా.. వైసీపీ అధికార ప్రతినిధులు అసంతృప్తిగా ఉన్నారా?
x
Highlights

రాష్ట్రంలో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.. ఊహించని విధంగా చాలా మంది ప్రజాప్రతినిధులు అయ్యారు. కానీ అధికారం దక్కినా పార్టీలోని అధికార...

రాష్ట్రంలో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.. ఊహించని విధంగా చాలా మంది ప్రజాప్రతినిధులు అయ్యారు. కానీ అధికారం దక్కినా పార్టీలోని అధికార ప్రతినిధులకు మాత్రం పదవులు దక్కలేదు. మీడియా సమావేశాలు, టీవీ డిబేట్లు, భహిరంగ సభల్లో పార్టీ గొంతును వినిపిస్తూ వస్తున్న అధికార ప్రతినిధులు చాలా మంది అసంతృప్తితో ఉన్నారట. అందులో పద్మజ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనుమూరు రవిచంద్రారెడ్డి, కాకుమాను రాజశేఖర్ తదితరులు ఉన్నారట. అయితే మొదటినుంచి వైసీపీలో సీనియర్ అధికార ప్రతినిధిగా ఉన్న వాసిరెడ్డి పద్మకు మాత్రం మహిళా కమిషన్ చైర్మన్ పదవి దక్కింది. బత్తుల బ్రహ్మానందరెడ్డి గత ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ అంబటి రాంబాబు వైపే మొగ్గు చూపారు జగన్. అయితే అధికారంలోకి రాగానే బత్తులకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తారని హామీ ఇచ్చారట జగన్.

ఇక పద్మజ కూడా నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారట. ఆమె దివంగత టీడీపీ మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ కు స్వయానా సోదరి. గతంలో కాంగ్రెస్ లో కీలక నాయకురాలిగా ఉన్న ఆమె 2016 లో జగన్ కు జై కొట్టారు. ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన కనుమూరు రవిచంద్రారెడ్డి కూడా పదవి కోసం ఎదురుచూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్ గాను, ప్రధాన కార్యదర్శిగాను రవిచంద్రారెడ్డి పనిచేశారు. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో విభేదించి వైసీపీలో చేరారు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే కాంగ్రెస్ లో ఉన్న సమయంలోనే టీవీ చర్చా కార్యక్రమాల్లో చాలా సార్లు వైసీపీని సమర్ధిస్తూ మాట్లాడారనే అభిప్రాయం ఉంది. అటువంటి నేత వైసీపీలోనే చేరి పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. అయితే పదవి మాత్రం ఇంకా రాలేదు.

అధికార ప్రతినిధుల్లో మరో కీలకనేత కాకుమాను రాజశేఖర్. ఈయనకు పదవి ఆఫర్ చేసినా తిరష్కరించారన్న ప్రచారం ఉంది. వైసీపీ ప్రభుత్వం ఎస్సి కార్పొరేషన్ ను విభజించి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అందులో ఒక పదవి రాజశేఖర్ కు ఆఫర్ చేసింది. అయితే రాజశేఖర్ ఆ పదవిని తిరష్కరించారట. అందుకు కారణం విభజిత పదవి ఇవ్వడమే అని అంటున్నారు విశ్లేషకులు. మరి రోజు మీడియా చర్చా కార్యక్రమాల్లో తమ గొంతుకను వినిపిస్తున్న ఈ అధికార ప్రతినిధులకు పదవీ యోగం ఇప్పట్లో ఉంటుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories