సినీరంగ ప్రవేశం చేస్తున్న లక్ష్మీపార్వతి?

సినీరంగ ప్రవేశం చేస్తున్న లక్ష్మీపార్వతి?
x
Highlights

ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ సీనియర్ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సినీరంగ ప్రవేశం చేస్తున్నట్టు సామాజిక...

ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ సీనియర్ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సినీరంగ ప్రవేశం చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 'రాధాకృష్ణ' అనే చిత్రంలో ఆమె నటించనున్నట్టు సారాంశం. ఈ సినిమాకు కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించనున్నారట. ఈ 'రాధాకృష్ణ' సినిమాని మహిళా ప్రధాన కథతో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి కీలక పాత్రలో నటిస్తునారని.. ఇందుకు సంబంధించి టెస్ట్ షూట్ కూడా జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా శ్రీనివాసరెడ్డి తాజాగా 'రాగల 24 గంటల్లో' అనే చిత్రాన్ని రూపొందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories