YSRCP Plenary 2022: నేటి నుంచి వైసీపీ ప్లీనరీ

YCP plenary from today
x

YCP plenary from today

Highlights

YSRCP Plenary 2022: ప్లీనరీలో పార్టీ ప్రతినిధులకు ఇచ్చే కిట్లు సిద్ధం

YSRCP Plenary 2022: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తైన తరువాత జరుగుతున్న ప్లీనరీని ఆ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులోనూ త్వరలో ఎన్నికలు ఉంటాయని భావిస్తున్న వేళ ఈ ప్లీనరీలో అదినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటనలు చేస్తారు అన్నది ఆసక్తి పెంచుతోంది. ఇవాళ, రేపు గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తున్నారు. అయితే తోలి రోజే ఐదు కీలక తీర్మానాలపై చర్చించనున్నారు. ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది.

రెండు రోజుల పాటు జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాల కోసం ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభంకానుంది. ఒక్కో జిల్లాకు రెండు కౌంటర్లు కేటాయిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ప్లీనరీకి హాజరైన నేతలు, కార్యకర్తలకు స్పెషల్ కిట్ అందిస్తారు. జ్యూట్ బ్యాగ్‌తో ఆ కిట్ ఉండనుంది. కిట్‌లో భాగంగా పార్టీ మేనిఫెస్టో, పార్టీ జెండా, 16 పేజీల సంక్షేమ పథకాల బుక్ లెట్, సీఎం సంతకంతో లేఖ, నవరత్నాల ముద్రతో ఒక మగ్, పెన్ను, నోట్ ప్యాడ్, ఫ్యాన్ గుర్తు కీ చెయిన్ ఇలా ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు అందచేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories