పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ సిద్ధం

YCP Party is Ready For Parliament Budget session
x

 Parliament Budget session (file image)

Highlights

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ సిద్ధం అయ్యింది. ఇప్పటికే సీఎం జగన్ దిశా నిర్దేశం చేయడంతో ఎంపీలు అందరూ రాష్ట్రానికి తీసుకురావాల్సి నిధులు,...

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ సిద్ధం అయ్యింది. ఇప్పటికే సీఎం జగన్ దిశా నిర్దేశం చేయడంతో ఎంపీలు అందరూ రాష్ట్రానికి తీసుకురావాల్సి నిధులు, మరికొన్ని కీలక అంశాల పై ఈ సమావేశాల్లో బలంగా పోరాడనున్నారు. కోర్ట్ కర్నూల్ కు తరలించడంతో పాటు, దేవాలయాల పై దాడులకు టీడీపీ కారణం అనే అంశాన్ని పార్లమెంట్ లో గట్టిగా గళం వినిపించనుంది వైసీపీ. పోలవరం కొత్త అంచనాల ఆమోదం, రాష్ట్రాల మధ్య నది జలాల సమస్య పైనా ఎంపీలు దృష్టి పెట్టనున్నారు.

ప్రతిసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి నిరాశే మిగులుతుంది. ఈ సారైనా రాష్ట్రానికి ఆశించదగ్గ స్థాయిలో బడ్జెట్ కేటయింపులు జరుగుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వైసిపి ఈ బడ్జెట్ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం వైఎస్ జగన్ తమ ఎంపీలకు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రత్యేక హోదాతో పాటు, రాజధాని వికేంద్రికరణ పైనా ఈ సారి ఫోకస్ చేయబోతున్నారు వైసిపి ఎంపీలు. ఇందులో భాగంగా హైకోర్టు ను కర్నూల్ కు తరలించేలా రి-నోటిఫికెషన్ ఇచ్చేలా కేంద్రంను ఒప్పించే ప్రయత్నాలు చేయనున్నారు. దిశా చట్టసవరణ బిల్లుకు ఆమోద ముద్ర పడేలా చూడాలని ఎంపీలకు సీఎం జగన్ సూచనలు చేశారు.

ఏపీలో దేవాలయాలపై వరుస దాడుల అంశాన్ని పార్లమెంచట్ లో ప్రస్తావించనున్నారు వైసీపీ సభ్యులు. దాడులకు ప్రధాన సూత్రదారి టీడీపీ అని అందుకు సంబంధించిన ఆధారాలు సభ ముందుంచుతామని ఇప్పటికే స్పష్టం చేశారు. వైసిపి, టీడీపీ ఎంపీల మధ్య పార్లమెంట్ వేదికగా దీనిపై రచ్చ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కేంద్రంలో హాట్ టాపిక్ గా మారిన వ్యవసాయ బిల్లులు పై వైసీపీ ఆచితూచి వ్యవహరించనుంది. గతంలోనూ కేవలం కండిషన్ల తో వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చామని, ఇప్పుడు ఆ కండిషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది వైసీపీ.

రాజకీయాలు మినహాయిస్తే, రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రాజెక్టులు, పెండింగ్ బకాయిలపై ఈ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ సభ్యులు దృష్టి పెట్టనున్నారు. పోలవరానికి సంబంధించి 56 వేల కోట్ల రూపాయతో పంపించిన కొత్త అంచనాల ఆమోదానికి కేంద్రాన్ని ఒప్పించేలా పార్టీ ఎంపీలు కృషి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అదేవిధంగా రాష్ర్టంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 మెడికల్ కాలేజీలకు అనుమతులు, నివర్ తుఫాన్ నష్టంకు రావాల్సిన 2 వేల కోట్ల నిధులు, రైల్వే జోన్, ఉపాధి హామీ పనిదినాలు పెంపు, రెవెన్యూ లోటు భర్తీ లాంటి అంశాలపై కూడా గట్టిగా తమవాణిని వినిపించేందుకు సిద్ధమైయ్యారు వైసిపి ఎంపీలు.


Show Full Article
Print Article
Next Story
More Stories