'అక్కడ వత్తి లేదు, నూనె లేదు, దీపమే లేదు'

అక్కడ వత్తి లేదు, నూనె లేదు, దీపమే లేదు
x
Highlights

ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి లపై ఓ రేంజిలో ఫైర్ అయ్యారు ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ డల్లాస్ మీటింగ్ లో జ్యోతి...

ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి లపై ఓ రేంజిలో ఫైర్ అయ్యారు ఎంపీ విజయసాయిరెడ్డి. జగన్ డల్లాస్ మీటింగ్ లో జ్యోతి వెలిగించలేదని.. ఇది హిందువులను అవమానించడమేనని సీఎం రమేష్ ట్వీట్ చేశారు. దానికి కౌంటర్ ట్వీట్ ఇచ్చారు విజయసాయిరెడ్డి.. 'ఎలక్ట్రానిక్ దీపాన్ని అగ్గిపెట్టతో సీఎం రమేష్ మాత్రమే వెలిగించగలడు. అక్కడ వత్తి లేదు, నూనె లేదు, దీపమే లేదు... చూడటానికి ఆయనకు కళ్ళే లేవు. బ్లడ్లో ఉన్న ఎల్లో వైరస్ ప్రభావం అలాగే ఉంటుంది! 40 గుళ్ళని కూల్చడం, సదావర్తి భూముల్ని స్వాహా చేయడం, వెంకన్న బంగారం, కిరీటాలు ఎత్తుకుపోవడం, పుష్కరాల్లో వేలకోట్లు మింగి 29 మందిని చంపేయడం... ఇదీ హిందుత్వాన్ని అవమానించటం అంటే!! ఇందులో సుజనా చౌదరి, CM రమేష్ పూర్వాశ్రమంలో భాగస్వాములు కారా?' అంటూ ఇద్దరు ఎంపీలపై మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories