'బంగారు బాతు' ను చంపేశారని ఎందుకు అంటున్నారో ఇప్పుడు అర్ధమైంది : ఎంపీ విజయసాయిరెడ్డి

బంగారు బాతు ను చంపేశారని ఎందుకు అంటున్నారో ఇప్పుడు అర్ధమైంది : ఎంపీ విజయసాయిరెడ్డి
x
Highlights

టీడీపీ, జనసేనలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. వల్లభనేని వంశీ వదిలిన సవాళ్లకు...

టీడీపీ, జనసేనలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. వల్లభనేని వంశీ వదిలిన సవాళ్లకు తెలుగుదేశం పార్టీ జవాబిచ్చే పరిస్థితిలో ఉందా? లోకేష్ ఏదో అన్నాడు కాని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. టీడీపీ మునిగిపోయే పార్టీ అని అందరికీ అర్థమైంది. చివరకు తండ్రీకొడుకు, తోక పార్టీ దత్తపుత్రుడు మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు.

అలాగే 'బంగారు బాతు' అమరావతిని చంపేశారని చంద్రబాబు గారు శోకాలు పెడుతున్నదెందుకో ఇప్పుడర్థమైందని అమరావతిలో తాత్కాలిక భవనాల కాంట్రాక్టు పొందిన సంస్థ రూ.500 కోట్లు ముట్ట చెప్పిందని ఇన్‌కంటాక్స్ వాళ్లు బయట పెట్టిన తర్వాత లింకులు, బొంకులన్నీ ఒక్కటొకటిగా వెలుగు చూస్తున్నాయి. అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories