logo

ఏపీలో ఫిరాయింపుల జోరు.. టీడీపీ నుంచి..

ఏపీలో ఫిరాయింపుల జోరు.. టీడీపీ నుంచి..
Highlights

మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్లు చేశారు....

మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్లు చేశారు. 'తెలంగాణాలో టిడిపి ఫినిష్ అయింది. బాబే కొందరిని కాంగ్రెస్ లోకి మిగిలిన వారిని బిజెపిలోకి పంపించారు. ఏపీలో కూడా ఫిరాయింపులు జోరందుకున్నాయి. పార్టీ మారే వారు బాబుపై ఒక్క విమర్శ చేయడం లేదు. ఇదంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు తెలిసి పోవడం లేదూ?' అని పేర్కొనగా.. అమరావతి రాజధానిపై కూడా ట్వీట్ చేశారు. 'అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుంది. ప్రజలూ ప్రశ్నిస్తారు. జవాబు చెప్పలేకే బాబు గారి నివాసాన్ని వరదలో ముంచారనే దుష్ప్రచారం మొదలు పెట్టారు 'తీసేసిన తాసిల్దార్లు'.' అంటూ మండిపడ్డారు.

అలాగే 'ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకు ఎంత వదలాలి అనేది ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్ణయిస్తారు. డ్యాం,బ్యారేజిల భద్రత వారికి ముఖ్యం. బ్యారేజి దిగువ ప్రజలు బలై పోయినా ఫర్వాలేదట. తన అక్రమ కొంప మునగటానికి వీల్లేదని కుట్ర స్టోరీలు తెరపైకి తెస్తున్నారు చంద్రబాబు గారు' అంటూ వరద ఉదృతిపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.


లైవ్ టీవి


Share it
Top