ఏ రాష్ట్రంలో ఉన్న అరెస్టు కాకుండా తప్పించుకోలేరు .. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏ రాష్ట్రంలో ఉన్న అరెస్టు కాకుండా తప్పించుకోలేరు .. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
x
Vijay Saireddy (File Photo)
Highlights

సామాజిక మాధ్యమాల్లో తనను లక్ష్యంగా చేసుకొని అభ్యంతరకర పోస్టులు పెడుతున్నా వారిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు.

సామాజిక మాధ్యమాల్లో తనను లక్ష్యంగా చేసుకొని అభ్యంతరకర పోస్టులు పెడుతున్నా వారిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. తనపై అసభ్యంగా పోస్టులు పెడుతున్న, వాటిని షేర్ చేస్తున్న వారిని విడిచిపెట్టేది లేదని విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు.

"వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా నా పేరుతో కొందరు సోషల్ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు సృష్టించి అసభ్య పదజాలంతో సాగిస్తున్న దుష్ప్రచారంపై ఆధారాలతో సహా ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ మొదలెట్టారు. ఈ ఫేక్‌ గ్యాంగ్‌ మొత్తాన్ని బుక్ చేసి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. సైబర్‌ క్రైమ్‌ చట్టం కింద వారిపై కఠిన చర్యలు తప్పవు.

ఫేక్‌ గ్యాంగ్‌ పోస్టులను అత్యుత్సాహంతో షేర్ చేసుకునే వాళ్ళు సైతం సైబర్ క్రైమ్ చట్టం కింద శిక్షార్హులే. అలాంటి వారు ప్రపంచంలో ఎక్కడున్నా...ఏ రాష్ట్రం, ఏ దేశంలో ఉన్నా సైబర్ క్రైమ్ పోలీసుల వలకు చిక్కక తప్పదు. కేసులు, అరెస్ట్‌లు ఎదుర్కోకుండా తప్పించుకోలేరు.

కాబట్టి నా వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో అసభ్య, ఫేక్‌ పోస్టులు పెట్టే వారితో పాటు వాటిని అత్యుత్సాహంతో సర్క్యులేట్ చేసే వారిని కూడా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విడిచి పెట్టరని హెచ్చరిస్తున్నాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories