విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటనలేంటి బాబూ..? ఎన్ని చేసినా నువ్వు రావణాసురునివే : విజయసాయిరెడ్డి

విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటనలేంటి బాబూ..? ఎన్ని చేసినా నువ్వు రావణాసురునివే : విజయసాయిరెడ్డి
x
Highlights

విజయనగరం జిల్లా రామతీర్థం రాములవారి విగ్రహా శిరస్సు ఖండన ఘటన ఏపీ రాజకీయాల్లో అగ్గిరాజేసింది.

విజయనగరం జిల్లా రామతీర్థం రాములవారి విగ్రహా శిరస్సు ఖండన ఘటన ఏపీ రాజకీయాల్లో అగ్గిరాజేసింది. విగ్రహం ద్వంసం పట్ల అధికార ప్రతిపక్ష పార్టీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వివాదాలకు కేంద్రబిందువతున్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని చంద్రబాబు బూటుకాళ్లతో సందర్శించడం పట్ల వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు హయంలో శంకుస్థాపనలు, ఇతర పండగల సమయంలో బూట్లతో కనిపించిన ఫొటోలు ఇప్నుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు వైఖరి పట్ల భగ్గుమంటున్నారు.

రామతీర్థం పర్యటించిన చంద్రబాబు బూటు కాళ్ళతో రామతీర్థం పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టడంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శులు గుప్పించారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ట్వీటర్ వేదికగా మండిపడ్డారు. శ్రీరాముని విగ్రహన్నితెలుగుదేశం వారే ధ్వసం చేసి.. ఇక విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటిస్తున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. జనం టీడీపీ ఛీదరించుకోవడంతో మతాల మధ్య చిచ్చురాజేయాలని చూస్తున్నారా అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్బంగా " శ్రీరాముని విగ్రహన్ని మీరు మీ గ్యాంగ్ ధ్వంసం చేసి ఆ విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటనలేంటి బాబూ? రామతీర్థం రామునితో రాజకీయాలు చేస్తావా? ఎన్ని చేసినా నువ్వు రావణాసురునివే. జనం ఛీదరించుకోవడంతో ఇప్పుడు మతాల మధ్య మారణహోమం సృష్టించాలని అనుకుంటున్నావా ?" విజయసాయి ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories