ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
x
Highlights

ఏపీలో సిట్‌ చిచ్చు రాజుకుంది. ఈఎస్‌ఐ స్కామ్ రాజకీయ దుమారం రేపుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఏపీలో సిట్‌ చిచ్చు రాజుకుంది. ఈఎస్‌ఐ స్కామ్ రాజకీయ దుమారం రేపుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సిట్ ఏర్పాటు రాజకీయ కక్షసాధింపని, మాజీమంత్రులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శిస్తుంది. అయితే గతంలో టీడీపీ సిట్ ఏర్పాటు చేయాలని కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దాంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఈ సిట్ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దోచుకున్న ప్రతి రూపాయిలో సగం లోకేష్‌కు ఇచ్చారని ఆరోపించారు. పార్టీ అండగా నిలవక పోతే డైరీలన్నీ బయటకు తీస్తానని బెదిరిస్తున్నాడట. లోకేశ్ చెబితేనే లేఖ రాశానని సన్నిహితుల వద్ద వాపోతున్నాడని ఆరోపించార. చంద్రబాబు ఆ‍యన కొడుకుల కనుసన్నల్లోనే కుంభకోణం జరిగిందని అందుకే అచ్చన్న ధీమాగా ఉన్నారని ఆరోపించారు.

మరో ట్వీట్ చేసిన విజయ సాయిరెడ్డి. వివిశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు అని విమర్శించారు. టీడీపీ నేతలు పలు సార్లు విశాఖ మిలీనియం టవర్స్‌లో సచివాలయం ఏర్పాటుకు నేవీ ఒప్పుకోవడం లేదని అసత్యలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నేవీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని వెల్లడించింది.

అలాగే దమ్ముంటే దర్యాప్తు సవాళ్లు విసిరిన వారంతా.. కుక్కిన పేనులయ్యారని టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. ఏ తప్పూ చేయకపోతే సిట్ ముందుకు వచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మీరు ఏ తప్పు చేయకపోతే నీరుపించుకోవాలని అన్నారు. అంతేకాదు చంద్రబాబుపై సెటైర్లు పేలుస్తూ రంగస్థలం సినిమాలో పేరడీ స్టైల్‌లో ట్వీట్ చేశారు. ఆజైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం. నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల... అని సోషల్ మీడియా కుర్రకారు తెగ ఊగిపోతున్నారు. పాపం అసలే ఎండాకాలం. రెండు ఏసీలేసుకుని పడుకునే వాడు. ఎలా తట్టుకుంటాడో ఏమో? అంటూ విజయ సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Show Full Article
Print Article
More On
Next Story
More Stories