మీరిచ్చే సందేశం ఇదేనా 'నిత్యకళ్యాణం' గారు : విజయసాయిరెడ్డి

మీరిచ్చే సందేశం ఇదేనా నిత్యకళ్యాణం గారు : విజయసాయిరెడ్డి
x
Highlights

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విట్టర్ ద్వారా...

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. అందులో.. 'జనసేన పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా 'నిత్యకళ్యాణం' గారూ. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేమిటి? ఇష్టమైతే ఎవరైనా ఎన్ని కళ్యాణాలైనా చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ప్యాకేజి స్టార్లు, వివాహ వ్యవస్థ అంటే గౌరవం లేని వారు ప్రజా నాయకులు ఎప్పటికీ కాలేరు. అతిగా ఊహించుకోకండి.' అంటూ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఇటు చంద్రబాబు ఇసుక దీక్షపై కూడా విజయసాయి తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చారు.

'చంద్రబాబు కొడుకు నారా లోకేష్ నాలుగు గంటలు అల్పాహారం మానేసి అదే దీక్ష అన్నాడు. ఇప్పుడు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్రతం చేస్తారట. నిరాహార దీక్ష అనే మాటను తండ్రీకొడుకులు అపహాస్యం చేస్తున్నారు. కనీసం ఒక రోజైనా భోజనానికి దూరం ఉండలేని వాళ్లు ప్రచారం కోసం దీక్షల పేర్లు ఉపయోగిస్తున్నారు.' అని తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
Show Full Article
Print Article
More On
Next Story
More Stories