బాలయ్య, పవన్‌కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ విసుర్లు

బాలయ్య, పవన్‌కళ్యాణ్‌పై వైసీపీ ఎంపీ విసుర్లు
x
nandigam suresh criticise balakrishna and pawan kalyan
Highlights

ప్రముఖ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు వైసీపీ ఎంపీ నందిగం సురేశ్

ప్రముఖ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు వైసీపీ ఎంపీ నందిగం సురేశ్. ఎన్టీఆర్ వద్ద నుంచి తెలుగుదేశంపార్టీని లాక్కున్న వారి సొంత బావ చంద్రబాబు దగ్గర మంత్రి పదవి సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇటీవలే వైసీపీ నేతలపై బాలకృష్ణ తీవ్రంగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. తన మౌనాన్ని చేతగాని తనంగా చూడొద్దని వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ.. బాలకృష్ణకు టీడీపీలో విలువే లేదన్నారు.

బాలకృష్ణ బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్ంలో సినిమా చేస్తున్నారని, అంతకంటే ఆయనకు సీన్ లేదని ఎద్దేవా చేశారు. టీడీపీలో బాలకృష్ణకు గౌరవం ఉంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇచ్చేవరని వ్యా‌ఖ్యానించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేను కూగా కాపడుకోలేకపోయారని విమర్శించారు. ఓ స్టార్ హీరో సామాన్యులపై రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. బీజేపీతో జట్టుకట్టి తనకు ఓట్లు వేసిన అభిమానులకు ఏం సమాధానం చేబుతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లోగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని జోస్యం చెప్పారు.

అలాగే మండలి రద్దుపై కొంత ఆలస్యం జరుగుతుందే కానీ కేంద్రం తప్పకుండా ఆమోదిస్తుందని తెలిపారు. అమరావతి తరలించవద్దని కోరుతు మద్దతు తెలపాలని ఎంపీ సురేశ్‌ను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. గులాబీలు ఇచ్చి శాంతియుతంగా నిరసన తెలిపారు. అమరావతి తరలించొద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ సురేశ్ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories