ముఖ్యమంత్రితో ఎమ్మెల్సీల భేటీ.. అటు టీడీపీ నేతలకు నోటీసులు

ముఖ్యమంత్రితో ఎమ్మెల్సీల భేటీ.. అటు టీడీపీ నేతలకు నోటీసులు
x
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు. రేపటినుంచి మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు అత్యంత గోప్యంగా క్యాబినెట్ నోట్, అసెంబ్లీ బిల్లు తయారవుతోంది. అయితే దీనిపై ముఖ్యమైన సీనియర్ మంత్రులతో మాత్రమే సీఎం జగన్ చర్చిస్తున్నారు. బిల్లు గురించి మండలిలో అనుసరించే వ్యూహంపై సుభాష్ చంద్ర బోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చర్చించారు. వారు ఇతర సబ్యులకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఇవాళ సాయంత్రం లోపు వైసీపీ ఎమ్మెల్సీ లంతా విజయవాడ చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రేపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందస్తు చర్యగా.. టీడీపీ నేతలకు సెక్షన్ 149 కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తోపాటు సీనియర్ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్యలకు నోటీసులు ఇచ్చారు. అలాగే కొందరి ఇళ్ల తలుపులకు నోటీసులు అంటించారు. అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. రేపటి అసెంబ్లీ సమావేశాల సందర్బంగా అసెంబ్లీ ముట్టడికి టీడీపీ పిలుపునిచ్చింది. దాంతో పోలీసులు అప్రమత్త చర్యల్లో భాగంగా ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ ను కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories