ఏపీ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పోతుల సునీత

X
పోతుల సునీతా
Highlights
ఏపీ శాసనమండలిలో ఖాళీ అయినా స్థానానికి వైఎస్సార్‌సీపీ మహిళా నేత పోతుల సునీత నామినేషన్ దాఖలు చేశారు.
Samba Siva Rao18 Jan 2021 12:51 PM GMT
ఏపీ శాసనమండలిలో ఖాళీ అయినా స్థానానికి వైఎస్సార్‌సీపీ మహిళా నేత పోతుల సునీత నామినేషన్ దాఖలు చేశారు. సునీత వెంట ఈ సందర్భంగా మంత్రులు ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఇవాళ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆమె రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
పోతుల సునీత గత ఏడాది తెలుగుదేశం గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు పోతుల సునీతకు చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. పదవి నుంచి ఆమె తప్పుకోవడంతో శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీనిపై నోటిఫికేషన్ విడుదల కావడంతో వైసీపీ తరఫున పోతుల సునీతకే అవకాశం ఇస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. పోతుల సునీత ఏగగ్రీవంగా ఎన్నికైయ్యే అవకాశం ఉంది.
Web Titleycp mlc candidate potula sunita filed nomination
Next Story