టీడీపీ నేతలు దమ్ముంటే రండి : వైసీపీ ఎమ్మెల్యే రజిని సవాల్..

టీడీపీ నేతలు దమ్ముంటే రండి : వైసీపీ ఎమ్మెల్యే రజిని సవాల్..
x
Highlights

టీడీపీ నేతలు దమ్ముంటే రండి : వైసీపీ ఎమ్మెల్యే రజిని సవాల్.. టీడీపీ నేతలు దమ్ముంటే రండి : వైసీపీ ఎమ్మెల్యే రజిని సవాల్..

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని టీడీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో టీడీపీ నేతలు అల్లకల్లోలం సృష్టిస్తున్నారని విమర్శించారు. చిలకలూరిపేటకు చెందిన వైసీపీ కార్యకర్తలను గతంలో టీడీపీ నేతలు కిడ్నాప్ చేసిమరి తీవ్రంగా కొట్టారన్నారు. టీడీపీ నేతలు ఆత్మకూరుకు వెళతామంటున్నారు.. మేమూ కూడా వస్తాం.. దమ్ముంటే రండి చర్చించుకుందామని సవాల్ విసిరారు. గతంలో జరిగిన గొడవలపై కూడా ఆత్మకూరులో చర్చిద్దామన్నారు. జగన్ పాలనను చూసి ఓర్వలేకే టీడీపీ ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుందన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మైనస్ సీట్లే వస్తాయని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories