శాసన మండలిని రద్దు చేయాలని జగన్ ను కోరుతున్నా: వైసీపీ ఎమ్మెల్యే రోజా

శాసన మండలిని రద్దు చేయాలని జగన్ ను కోరుతున్నా: వైసీపీ ఎమ్మెల్యే రోజా
x
Highlights

శాసన మండలిని రద్దు చేయాలని తాను సీఎం జగన్ ను గట్టిగా కోరుతున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. శాసనమండలిని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

శాసన మండలిని రద్దు చేయాలని తాను సీఎం జగన్ ను గట్టిగా కోరుతున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.శాసనమండలిని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగానే శాసన మండలి విలువలు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సిన పెద్దల సభ ఇలా అభివృద్ధిని అడ్డుకుంటుంటే ఆ సభ ఉండాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. కౌన్సిల్ రద్దయితే యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ పదవులు పోతాయని అన్నారు. 'బాగా బలిసిన కోడి.. చికెన్ షాప్ కు వెళ్తే.. ఏమవుతుందో.. నారా లోకేష్ గ్రహించాలి. యనమల మహా మేధావిగా ఫీల్ అవుతున్నారు..రెండుసార్లు ఓడిపోయారు. పెద్దల కోసం ఏర్పాటు చేసిన సభకు తన ఇంట్లో ఉన్న దద్దమ్మను, దద్దోజనాన్ని పంపించారు. చంద్రబాబు ఓటమిపాలైనా ఇంకా అహంకారం మాత్రం తగ్గలేదు. ప్రజా క్షేత్రంలో ఓడిపోయిన యనమల మహా మేధావిలా ఫీలవుతున్నారు. ఇండియా టుడే సర్వేల బెస్ట్ సీఎం సర్వేలో 4వ స్థానంలో జగన్‌గారు ఉన్నారని రోజా అన్నారు.

వైసీపీకి చెందిన మండలిలో సభ్యులైన మంత్రులే మండలిని రద్దు చెయ్యాలని చెప్పారని గుర్తుచేశారు. మండలి గ్యాలరీల్లో కూర్చుని, చైర్మన్ ను బెదిరించి, తనకు అనుకూలంగా ఆయన వ్యవహరించేలా చంద్రబాబు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఓ రాయలసీమ నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా చంద్రబాబునాయుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే రాయలసీమను చంద్రబాబు సర్వనాశనం చేశారని, ఇప్పుడా ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు న్యాయ రాజధానిని పెడతామని చెబుతుంటే స్వాగతించాల్సింది పోయి అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతిలో కొన్న భూములను కాపాడుకునేందుకే అమరావతి ఉద్యమం అంటూ ఆ ప్రాంత ప్రజల్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే తాను ఇచ్చిన హామీల్లో 80 శాతం హామీలను జగన్ నెరవేర్చారని రోజా అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories