Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh: టీడీపీ సర్పంచులు‌, నాయకులను దగ్గరకు రానివ్వం -ఎమ్మెల్యే * వాళ్లు చెప్పిన ఏ పని అధికారులు చేయాల్సినవసరం లేదు -ఎమ్యెల్యే

Sandeep Eggoju
Published on: 8 Aug 2021 10:34 AM IST
YCP MLA Prasanna Kumar Sensational Comments About TDP Leaders
X

వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంఖేలన వ్యాఖ్యలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకూరుపేటలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. టీడీపీ సర్పంచులు, నాయకులను దగ్గరకు రానిచ్చే ప్రసక్తేలేదని హాట్‌ కామెంట్స్‌ చేశారు. వాళ్లు చెప్పిన ఏ పనిని అధికారులు చేయొద్దంటూ దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేతలు చెప్తేనే పనులు చేయాలని, ఇంకెవరు చెప్పినా పట్టించుకోవద్దని సూచించారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌.. ఏం తప్పు చేశారని వైసీపీ బలపర్చిన అభ్యర్థులను ఓడించారంటూ ప్రశ్నించారు. గెలిచిన టీడీపీ అభ్యర్థులంతా దిష్టిబొమ్మలేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story