మరో బాంబ్ పేల్చిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి

మరో బాంబ్ పేల్చిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
x
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Highlights

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు. షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు. షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి 13 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వీళ్ళలో కొందరు ఎమ్మెల్యేలు షరతులు ఉన్నా కూడా వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉందంటే అది జగన్‌ పుణ్యమే.

2024లో వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. టీడీపీకి 3వ స్థానమే ఉంటుందని జోశ్యం చెప్పారు. కాగా తనతో 8 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు గతంలోనే తెలిపారు. ఇదిలావుంటే ఏపీలో ప్రస్తుతం వలసల రాజకీయం నడుస్తోంది. టీడీపీ, బీజేపీకి చెందిన కీలకనేతలు వైసీపీలో చేరుతున్నారు. టీడీపీ కీలకనేత బీద మస్తాన్ రావు, బీజేపీకి చెందిన గోకరాజు రంగరాజు వైసీపీలో చేరారు.

అయితే వైసీపీ నుంచి బీజేపీలో చేరేందుకు నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్నటిదాకా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఆయనతోపాటు విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మరొకరు కూడా వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇటు ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు టీడీపీకి ఝలక్ ఇస్తారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories