బిగ్ బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్

బిగ్ బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్
x
Highlights

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్

నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి తనపై దౌర్జ్యనం చేసి బెదిరించారని నెల్లూరు జిల్లా వెంకటాచలం మహిళా ఎంపీడీవో పోలీస్ స్టేషన్ ముందు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి వద్ద ఓ లేఅవుట్ కు పైపులైను కనెక్షన్‌ కావాలని తనకు దరఖాస్తు చేసుకున్నారని.. దీంతో పరిశీలించడం ఆలస్యమైందన్న కారణంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్‌లో బెదిరించారని, శుక్రవారం రాత్రి కల్లూరుపల్లిలోని తన నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను బెదిరించారని ఎంపీడీవో సరళ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తిపై ఐపీసీ 448, 427, 290, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్‌ కింద కేసు నమోదయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories