పుచ్చకాయలపై వైసీపీ ఎమ్మెల్యే స్టిక్కర్.. దీన్ని సేవ అంటారా? ఓట్ల రాజకీయం అంటారా?


కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. భారత్ లోనూ కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది.
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. భారత్ లోనూ కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. దీంతో పేదలు ఆకలితో అలటిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకొస్తున్నారు. అయితే రాజకీయ నాయకులు చేస్తున్న సేవా కార్యక్రమాలు విమర్శలకు దారితీస్తున్నాయి.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మధ్య అజిపోవడంతో.. ఈ తరుణంలో ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ విమర్శలు గుప్పించింది.
''దీన్ని సేవ అంటారా? ఓట్ల రాజకీయం అంటారా? అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ 6వ వార్డు వైసీపీ అభ్యర్థి సయ్యద్ జావీద్ ఖాద్రి.. పుచ్చకాయలకు కూడా వైసీపీ స్టిక్కర్లు వేసి పంచుతున్నారు.'' అని తెలుగు దేశం పార్టీ ట్వీట్ చేసింది.
దీన్ని సేవ అంటారా? ఓట్ల రాజకీయం అంటారా?
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) April 13, 2020
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ 6 వ వార్డు వైసీపీ అభ్యర్థి సయ్యద్ జావీద్ ఖాద్రి... పుచ్చకాయలకు కూడా వైసీపీస్టిక్కర్ లు వేసి పంచుతున్నారు. pic.twitter.com/s5C6KxTSVd

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



