వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్‌ ఆత్మహత్య

YCP MLA Kapu Ramachandra Reddy Son In Law Is No More
x

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్‌ ఆత్మహత్య

Highlights

*కుంచనపల్లిలోని ఫ్లాటులో ఉరివేసుకుని మంజునాథ్‌ ఆత్మహత్య

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఫ్లాటులో ఉరివేసుకున్నాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మంజునాథ్ మృతదేహాన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంజునాథ్ వృతిరిత్యా కాంట్రాక్టర్ కాగా.. ఆయన స్వస్థలం కడప జిల్లా రాజంపేట. విషయం తెలుసుకున్న కాపు రామచంద్రారెడ్డి అనుచరులు, వైసీపీ శ్రేణులు మణిపాల్‌ ఆసుపత్రికి తరలివస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories