టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేజోగి రమేష్

X
Highlights
* టీడీపీ నేతలు అందరూ గ్యాంగ్ స్టార్స్, స్కామ్ స్టార్స్: జోగి రమేష్ * రాయపాటి 7296 కోట్లు అవినీతిని సీబీఐ గుర్తించింది: జోగి రమేష్ * రాయపాటి చేసిన స్కాంలో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ * చంద్రబాబు తన ఆస్తులపై విచారణకు సీబీఐకి లేఖ రాయాలని సవాల్
admin23 Dec 2020 11:40 AM GMT
టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.చంద్రబాబు గ్యాంగ్ అవినీతి చిట్టా ఒక్కొక్కటి బయటకి వస్తుందని తెలిపారు.టీడీపీ నేతలు అందరూ గ్యాంగ్ స్టార్స్, స్కామ్ స్టార్సేనని ఆరోపించారు.
టీడీపీలో అందరూ ఆంధ్రా మాల్యాలేనని విమర్శించారు. రాయపాటి 7296 కోట్లు అవినీతిని సీబీఐ గుర్తించిందని చెప్పారు. ఇక రాయపాటి చేసిన అవినీతి స్కాంలో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి స్కాంలో చంద్రబాబు వాటా లేకపోతే ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఆస్తులపై విచారణకు సీబీఐకి లేఖ రాయాలని ఎమ్మెల్యే జోగి రమేష్ సవాల్ విసిరారు.
Web TitleYCP MLA jogi ramesh hard complaints on telugudesham party
Next Story