వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌‌లోని వాహనం బోల్తా

వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌‌లోని వాహనం బోల్తా
x
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్
Highlights

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. పుత్తూరు మండలంలోని పరమేశ్వర మంగళం వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

చెవిరెడ్డి చెన్నై వెళుతుండగా.. కారు బోల్తాపడిందని తెలుస్తొంది. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనంలోని సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని తిరుపతిలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ కారుకు ముందు వాహనంలో ఉన్నారు. చెవిరెడ్డి కాన్వాయ్ బోల్పాపడిందని తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనాన్ని పక్కకు తీసి వారికి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులన్ని దగ్గరుండి ఆస్పత్రికి తరలించే వరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి దగ్గర ఉన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories