మహానాడులో మమ్మల్ని విమర్శించడం కాదు.. మీ వారసుడు పనికొస్తాడో లేదో.. అంబటి

మహానాడులో మమ్మల్ని విమర్శించడం కాదు.. మీ వారసుడు పనికొస్తాడో లేదో.. అంబటి
x
Ambati Rambabu (File Photo)
Highlights

టీడీపీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు. అధికారం కోల్పోయి ఏడాది తరువాత టీడీపీ మహానాడు...

టీడీపీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు. అధికారం కోల్పోయి ఏడాది తరువాత టీడీపీ మహానాడు నిర్వహిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. మహానాడులో మమ్మల్ని విమర్శించడం కాదు మీ వారసుడు పనికొస్తాడో లేదో పరిశీలించుకోండ‌ని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు పొడవడం దండేసి పొగడటంలో చంద్రబాబు దిట్ట‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు ఎన్టీఆర్ పేరు తలిచే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు.. అమరావతి తన సృష్టి అన్న వారసుడు లోకేష్ మంగళగిరి లో ఘోరమైన ఓటమి చూసార‌ని విమ‌ర్శించారు.

ఎన్నికల్లో ఘోరమైన ఓటమిపాలైన ఇంకా వాళ్లకు బుద్దిరాలేదని, గతంలో కంటే ఘోరంగా టీడీపీ ఓటమిపాలై ఏడాది అవుతున్నా ఇంకా వైసీపీపై విమర్శలు తప్ప ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోలేదని విమ‌ర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు టీటీపీ లేద‌ని విమ‌ర్శించారు. కరోనా సమయంలో రెండు నెలలు హైదరాబాద్ పారిపోయినా.. LG పాలిమర్స్ బాధితులను కనీసం పరామర్శించేందుకు రాలేకపోయారని, టీడీపీ పాతనమవున్న రాజకీయపార్టీ ఇప్పటికయినా ఆత్మవిమర్శ చేసుకోకపోతే భవిష్యత్తు ఉండదన్నారు. మహానాడు లేకుంటే హైదరాబాద్ నుంచి వచ్చేవారు కూడా కాద‌ని, చంద్రబాబుకు రాజకీయ పదావీకాంక్ష తప్ప ప్రజల గురించి ఆలోచన లేదని విమ‌ర్శించారు.

అరాచక పాలన అని తీర్మానిస్తారా, బురదజల్లడం తప్ప మరో విధానం మీకుందా? అని ప్ర‌శ్నించారు. నాకు ఓటు వేయకపోయినా .. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హుడయితే చాలు అని మేము గర్వాంగా ప్రకటించాం అని గుర్తు చేశారు. సీఎం జగన్ చాలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. సంక్షేమం కుదిస్తున్నారు పధకాలను రద్దు చేస్తున్నారని ఆరోపిస్తున్నారే.. ప్రజలను మోసం చేసి ఎన్నికలకు ముందు మొదలు పెట్టినవి పథకాలా.. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు, జనతా బజార్లు తీసుకురాబోతున్నాం.. మా పనులు మెచ్చుకోకున్నా పర్లేదు దూషించే హక్కు మీకు లేదని విమ‌ర్శించారు. వాలంటరీ వ్యవస్థ పై ఆరోపణలు చేస్తూ వారి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారని మండిప‌డ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories