logo
ఆంధ్రప్రదేశ్

Abbaya Chowdary: చింతమనేని అవాకులు చవాకులు పేలితే చర్మం వలి చేస్తాం

YCP MLA Abbaya Chowdary Fired on Chintamaneni Prabhakar
X

ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

* చేతకాక కాదు.. చింతమనేని.. పులి కడుపున పుట్టా * తాట తీస్తా గుర్తు పెట్టుకో అని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హెచ్చరిక

Abbaya Chowdary: టీడీపీ నేత చింతమనేనికి దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఘాటు వార్నింగ్ ఇచ్చారు. పదేళ్లుగా అంబేద్కర్ విగ్రహం పెడతామంటే చింతమనేని అడ్డుపడ్డారని ఇవాళ జగన్ వచ్చాక తాము విగ్రహావిష్కరణ చెయ్యగలిగామని అబ్బయ్య చౌదరి అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తు ఊరుకోం.. చర్మం వలి చేస్తాం.. పులి కడుపున పుట్టా.. తాట తీస్తా అంటూ అబ్బయ్య చౌదరి వార్నింగ్ ఇచ్చారు.. విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో 90 శాతం పథకాలు అమలు చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. దెందులూరు నియోజక వర్గాన్ని 750 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామనీ అన్నారు.

Web TitleYCP MLA Abbaya Chowdary Fired on Chintamaneni Prabhakar
Next Story