విశాఖలో వైసీపీ నాయకులు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు: కన్నా లక్ష్మీనారాయణ

విశాఖలో వైసీపీ నాయకులు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు: కన్నా లక్ష్మీనారాయణ
x
కన్నా లక్ష్మి నారాయణ
Highlights

రాజధాని సమస్యపై రైతుల ఆందోళనలకు మద్దతుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ దీక్ష నిర్వహించారు.

రాజధాని సమస్యపై రైతుల ఆందోళనలకు మద్దతుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ దీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి మోడీ ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధానికి పునాది రాయి వేసిన చోట తన నిరసనను ప్రారంభించారు. పవిత్రమైన నీరు మరియు మట్టికి నమస్కరించి మౌన దీక్ష చేపట్టారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. అంతకుముందు, కన్నా మాట్లాడుతూ.. మూడు రాజధానులపై ప్రభుత్వం మూర్ఖంగా ముందుకు వెళుతోందని.. రాష్ట్రానికి ఇది పెద్ద సమస్యగా మారుతుందని ఆరోపించారు.

ఇదొక అవివేక చర్య అని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలో వైయస్ఆర్సిపి నాయకులు కొందరు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. మరోవైపు అమరావతిలో రైతులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతోంది. అభివృద్ధి మరియు రాజధానిపై జిఎన్ రావు కమిటీ సమర్పించిన నివేదికతో పాటు పలు కీలక అంశాలు సమావేశంలో చర్చిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories