ఆమంచి ఎఫెక్ట్.. భవిశ్యత్ కార్యాచరణ ప్రకటించనున్న వైసీపీ నేత..

ఆమంచి ఎఫెక్ట్.. భవిశ్యత్ కార్యాచరణ ప్రకటించనున్న వైసీపీ నేత..
x
Highlights

ప్రకాశం జిల్లా చీరాలలో రాజాకీయాలుమలుపులు తిరుగుతున్నాయి.. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరనుండటంతో ఆ పార్టీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి....

ప్రకాశం జిల్లా చీరాలలో రాజాకీయాలుమలుపులు తిరుగుతున్నాయి.. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరనుండటంతో ఆ పార్టీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. చీరాల వైసీపీ ఇంచార్జ్ యడం బాలాజీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆమంచికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. అలాగే శుక్రవారం కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసుకుని భవిశ్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని బాలాజీ చెబుతున్నారు. కాగా బాలాజీని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించింది అధిష్టానం. మరోవైపు ఆమంచి పార్టీ మారడంతో కరణం బలరాంను చీరాల బరిలో నిలపనుంది టీడీపీ. అయితే బలరాం అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories