logo
ఆంధ్రప్రదేశ్

East Godavari: అయినవిల్లి ఎంపీడీఓ విజయపై వైసీపీ నేత దురుసు ప్రవర్తన

YCP Leader Scolds East Godavari Ainavilli MPDO Vijaya | AP Live News
X

East Godavari: అయినవిల్లి ఎంపీడీఓ విజయపై వైసీపీ నేత దురుసు ప్రవర్తన

Highlights

East Godavari: వైసీపీ నాయకులపై ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన ఎంపీడీఓల సంఘం...

East Godavari: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవోను వైసీపీ నాయకుడు దుర్భషలాడారు. తాము చెప్పిందే చేయాలంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనతో ఎంపీడీవో కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ సర్పంచ్ తాతారావు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. మేం చెప్పిన మాట వినడం లేదు, మా మాట వినకపోతే ఊరుకోం అంటూ ఎంపీడీవోపై విరుచుకుపడ్డారు.

కార్యాలయ సూపరింటెండెంట్‌ దీక్షితులు వారిస్తున్నా.. తీవ్ర పదజాలంతో దూషించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపి నలుగురు వాలంటీర్లను తొలగించినందుకు జడ్పీటీసీ సభ్యుడు సైతం తనను దూషించారని, తాజాగా వైసీపీ నాయకుడు కార్యాలయానికి వచ్చి బెదిరించారని ఎంపీడీవో అమలాపురం ఆర్డీవోకి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు జడ్పీటీసీ, మాజీ సర్పంచ్ తాతారావు, వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమలాపురం డీఎస్పీ తెలిపారు.

Web TitleYCP Leader Scolds East Godavari Ainavilli MPDO Vijaya | AP Live News
Next Story