సరిలేరు మీకెవ్వరు సార్ : పీవీపీ

సరిలేరు మీకెవ్వరు సార్ : పీవీపీ
x
Highlights

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుపై.. వైసీపీ విజయవాడ లోక్ సభ ఇంచార్జీ పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో...

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబుపై.. వైసీపీ విజయవాడ లోక్ సభ ఇంచార్జీ పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. 'ఐదువేల కోట్లు హారతి కర్పూరంలా తగలబెట్టారు. ఇంకా జోలె పట్టుకొని అడుక్కునేలా ప్రతి ఆంధ్రుడిని రోడ్డు మీద పడవేసారు. అదే జోలెలో మీ హెరిటేజ్ షేర్స్, జూబ్లీహిల్స్ భవనాలు కూడా దానమిస్తే, బెజవాడ, వెనిస్ ఏమిటి అంతకుమించిన నగరాన్ని చేద్దాం. సరిలేరు మీకెవ్వరు సార్' అంటూ ట్వీట్ చేశారు పీవీపీ.

కాగా పొట్లూరి వరప్రసాద్ గడిచిన ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని చేతిలో ఓటమి చెందారు. ప్రస్తుతం వైసీపీలో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు. దేవినేని అవినాష్ టీడీపీ నుంచి వైసీపీలో చేరడానికి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అవినాష్ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి ఇంఛార్జిగా కొనసాగుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories