వైసీపీకి కీలకనేత రాజీనామా..

వైసీపీకి కీలకనేత రాజీనామా..
x
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Highlights

ప్రకాశం జిల్లాలో డీసీఎంఎస్ చైర్మన్ పదవిపై చిచ్చు రేగింది. డీసీఎంఎస్ పై ఆశలు పెట్టుకున్న వైసీపీ నేత ముద్దన తిరుపతి నాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ప్రకాశం జిల్లాలో డీసీఎంఎస్ చైర్మన్ పదవిపై చిచ్చు రేగింది. డీసీఎంఎస్ పై ఆశలు పెట్టుకున్న వైసీపీ నేత, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సన్నిహితుడు అయిన ముద్దన తిరుపతి నాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. చాలా ఏళ్లుగా పార్టీలో ఉండి డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఆశించిన ముద్దన, ఆ పదవిని వేరే వాళ్లకు ఇవ్వడంతో అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. ఇకనుంచి వైసీపీతో తనకెటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పదవులు దక్కుతున్నాయని ఆరోపించిన ముద్దన,

తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఆయన త్వరలో బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఆ పార్టీ పర్చూరు నాయకుడు రావి రామనాథంబాబుకు ఇచ్చారు. గతంలో వైసీపీకి పర్చూరు ఇంఛార్జిగా పనిచేసిన రామనాధంబాబు గడిచిన ఎన్నికల్లో పర్చూరు టికెట్ ను దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇచ్చారని టీడీపీలోకి ఫిరాయించారు.

వైసీపీ అధికారంలోకి రావడంతో తిరిగి వచ్చారు. ఆయన రాకను నిరసిస్తూ దగ్గుబాటి కుటుంబం వైసీపీకి దూరమైంది. తాజాగా రామనాధంబాబుకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇవ్వడంతో తిరుపతి నాయుడు దూరమయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories