పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ హడావుడి : దేవినేని అవినాష్‌

పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ హడావుడి :  దేవినేని అవినాష్‌
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజధానిలో పర్యటించే నైతిక హక్కు కోల్పోయారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్‌ అన్నారు. గత...

టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజధానిలో పర్యటించే నైతిక హక్కు కోల్పోయారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్‌ అన్నారు. గత అయిదేళ్లలో రాజధానిపై మీటింగ్‌లో మాట్లాడటం తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. శంకుస్థాపన చేసిన తరువాత ఒక్కసారైనా అమరావతి ప్రాంతానికి వెళ్ళారా అని ప్రశ్నించారు . ఆంధ్రప్రదేశ్‌ను భ్రష్టు పట్టించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

అన్ని జిల్లాల్లోని టీడీపీ కార్యకర్తలే చంద్రబాబును నిలదీస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల బిడ్డలకు ఉచిత విద్య,జాతీయ ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పని కల్పిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో రాజధానిలో హడావుడి చేశారని దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ఇకనైనా టీడీపీ ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories