ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూకుడు

X
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూకుడు
Highlights
*వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు ఘనవిజయం *తొలి దశ ఎన్నికల్లో వైసీపీ ఖాతాలోకి మెజారిటీ గ్రామాలు *ఏకగ్రీవమైన 525 పంచాయతీల్లో వైసీపీకి 500, టీడీపీ 18, ఇతరులు 7
Samba Siva Rao9 Feb 2021 12:13 PM GMT
ఏపీ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు ముందంజలో దూసుకుపోతున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో మొత్తం 3249 పంచాయతీలు ఉండగా... 525 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 500 పంచాయతీలను వైసీపీ.... 18 గ్రామాలను టీడీపీ.... 7 పంచాయతీలను ఇతరులు కైవసం చేసుకున్నారు. ఇంకా, మిగిలిన 2723 గ్రామ పంచాయతీలకు ఇవాళ పోలింగ్ నిర్వహించారు. 2723 సర్పంచ్ పదవులకు 7వేల 506మంది...... 20వేల 157 వార్డు స్థానాలకు 43,601మంది అభ్యర్థులు పోటీపడ్డారు. తొలి దశ పోలింగ్ జరిగిన గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మెజారిటీ గ్రామాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. దాంతో, అత్యధిక స్థానాలను అధికార వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Web TitleYCP Going to be the lead in Ap Panchayati Elections
Next Story