నారా లోకేష్ కు ఆర్కే మరో షాక్..

నారా లోకేష్ కు ఆర్కే మరో షాక్..
x
Highlights

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి మరో షాక్ తగిలింది. ఆయనను డిఆర్సీ సమావేశానికి రాకుండా బహిష్కరించింది. డీఆర్సీ సమావేశం నుంచి లోకేష్‌ని...

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి మరో షాక్ తగిలింది. ఆయనను డిఆర్సీ సమావేశానికి రాకుండా బహిష్కరించింది. డీఆర్సీ సమావేశం నుంచి లోకేష్‌ని బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, రంగనాథరాజు, సుచరితతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ఆళ్ల నిర్ణయాన్ని సమర్ధించారు. గుంటూరు జిల్లా పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి, హోమంత్రి సుచరితపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీవ్రంగా స్పందించారు వైసీపీ ఎమ్మెల్యేలు. దీంతో ప్రభుత్వ సమావేశాలకు లోకేష్ ను ఆహ్వానించవద్దని తీర్మానించారు. కాగా గత ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగిన లోకేష్‌‌పై ఆర్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories