టీడీపీలో అంతర్గత విభేధాలున్నాయి : సాదినేని యామిని

టీడీపీలో అంతర్గత విభేధాలున్నాయి : సాదినేని యామిని
x
Highlights

టీడీపీకి సాధినేని యామిని వీడి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలే కాకుండా బలమైన కారణాలు ఉన్నాయని, చంద్రబాబులో నాయకత్వ లక్ష్యనాలు చూసి నేర్పుకున్నానని ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

టీడీపీకి సాధినేని యామిని వీడి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ వీడడానికి వ్యక్తిగత కారణాలే కాకుండా బలమైన కారణాలు ఉన్నాయని, చంద్రబాబులో నాయకత్వ లక్ష్యనాలు చూసి నేర్పుకున్నానని ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే తాజా ఆమె టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వ్యక్తిత్వంపై ప్రత్యర్థులు అనైతిక వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఎవరూ తనకు మద్దతుగా నివలేదన్నారు.

తెలుగుదేశంలో అంతర్గత విభేదాలున్నాయని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాల మారిపోయాయన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టికేట్ ఇవ్వని కారణంతో పార్టీ మారుతున్నాన్న ప్రచారం అవాస్తమన్నారు. పదవులపై తనకు ఎలాంటి ఆశ లేదన్నారు. ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాల, కూల రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందుకు టీడీపీ మినహాయింపు కాదని ఆమె వాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. బంధుప్రీతి, బాంధవ్యాలకు బాబు అతీతుడు కాదని పేర్కొన్నారు. పొత్తుల విషయం నైతిక విలువలు పాటించడం లేదని విమర్శించారు. అలాంటి చోట తన లాంటి వారికి న్యాయం జరగదన్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీలో స్థానం లేదని‎, జాతీయ పార్టీలోనే గౌరవం దక్కుతుదని అందుకే బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు.

అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీని ఒక్కొక్కరు వీడుతున్నారు. తాజాగా టీడీపీ తరపున బలమైన వాయిస్ వినిపించగల యామిని లాంటి వారు ఆ పార్టీని వీడడం పెద్ద దెబ్బే అని చెప్పాలి. సోషల్ మీడియాలోనూ, టీవీ చర్చ కార్యక్రమాల్లోనూ యామిని బలమైన వాయిస్ వినిపించారు. యామిని బీజేపీలో చేరితే ఆ పార్టీ తరపున ప్రభుత్వా విధానాలను ప్రశ్నించడానికి గట్టి వాయిస్ ఉంటుంది. మూడు నెలల క్రితం ఆమె బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కొన్ని రోజులు పాటు మౌనంగా ఉన్న సాధినేని యామిని రాజీనామా లేఖను పంపి షాక్ ఇచ్చారు. అయితే తాజాగా యామిని ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై కూడా విమర్శలు చేయడం చర్చినీయంశంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories