విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ బీసీ గేట్‌ దగ్గర కార్మికుల ఆందోళన

Workers Protest near the BC Gate of the Visakhapatnam Steel Plant
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

* కార్మికుల నిరసనకు సంఘీభావం తెలిపిన మంత్రి అవంతి * రాజకీయాలకు అతీతంగా ప్రైవేటీకరణను అడ్డుకుంటాం -మంత్రి * కేంద్రం ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి -మంత్రి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ ప్లాంట్‌ బీసీ గేట్‌ దగ్గర కార్మిక సంఘాల ఆందోళన కొనసాగుతోంది. ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. కార్మికుల నిరసనకు సంఘీభావం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆయన అన్నారు. కేంద్రం ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే ఉద్యమంలోకి వస్తారని హెచ్చరిస్తున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్.

Show Full Article
Print Article
Next Story
More Stories