Visakhapatnam: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతం

స్టీల్ ప్లాంట్ నిరసన (ఫైల్ ఫోటో)
Visakhapatnam: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై ఆగ్రహ జ్వాలలు * కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు
Visakhapatnam: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంతో విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి. జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం జంక్షన్ స్టీల్ ప్లాంట్ మేయిన్ గేట్ దగ్గర ఉక్కు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. కూర్మన్నపాలెం కూడలిలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్రం ప్రకటన ప్రతులను దగ్దం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా ఇవాళ విశాఖలోని స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
Green Fennel: పచ్చిసోంపు తింటే బీపీ కంట్రోల్.. ఇంకా ఈ ప్రయోజనాలు..!
25 Jun 2022 1:30 PM GMTSalaries Hike: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.....
25 Jun 2022 1:00 PM GMTడబుల్ ఎంటర్టైన్ మెంట్.. బాలయ్య కోసం బుల్లితెర మీద కి చిరంజీవి..
25 Jun 2022 12:30 PM GMTమరింత ఉత్కంఠగా మహారాష్ట్ర పాలిటిక్స్.. డిప్యూటీ స్పీకర్‌పై ఏక్నాథ్...
25 Jun 2022 12:00 PM GMTLiver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. అది లివర్...
25 Jun 2022 11:30 AM GMT