Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం

Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో మోగిన సమ్మె సైరన్‌ *స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యానికి సమ్మె నోటీస్‌ ఇచ్చిన కార్మికులు

Sandeep Eggoju
Updated on: 11 March 2021 3:58 PM IST
Workers Gave The Strike Notices To Steel Plant Management
X

విశాఖ స్టీల్ ప్లాంట్ సమ్మె (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలను మరింత ఉధృతం చేశారు కార్మికులు. ఎలాగైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యమంలో ఊపు పెంచారు. ఇప్పటికే గత కొంతకాలంగా నిరసనలు, ఆందోళనలతో విశాఖ అట్టుడుకుతోంది. ఇప్పుడు మరోసారి స్టీల్‌ ప్లాంట్‌లో సమ్మె సైరన్‌ మోగనుంది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించాయి. ఈ నెల 25 తర్వాత ఏ రోజైనా సమ్మెకు దిగొచ్చని తెలిపాయి. ఇప్పటికైనా కేంద్రం.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు కార్మికులు.

మరోవైపు ఉక్కు ఉద్యమానికి ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ మద్దతు ప్రకటించగా.. తాజాగా.. మెగాస్టార్‌ చిరంజీవి కూడా కార్మికుల ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story