బుట్టల సహాయంతో ఇసుకను తీస్తున్న కార్మికులు

బుట్టల సహాయంతో ఇసుకను తీస్తున్న కార్మికులు
x
Highlights

ప్రస్తుతం ఏపీలో ఇసుక తుఫాను చెలరేగుతోంది. నదుల్లో నీరు చేరడంతో ఇసుక దొరక్క భవననిర్మాణ కార్మికులు పనులు కోల్పోయారు. నిర్మాణ రంగం అస్తవ్యస్తమైంది. అయితే ఇసుక కొరత కారణంగా చాలా మంది కార్మికులు వేరే పనులకు

ప్రస్తుతం ఏపీలో ఇసుక తుఫాను చెలరేగుతోంది. నదుల్లో నీరు చేరడంతో ఇసుక దొరక్క భవననిర్మాణ కార్మికులు పనులు కోల్పోయారు. నిర్మాణ రంగం అస్తవ్యస్తమైంది. అయితే ఇసుక కొరత కారణంగా చాలా మంది కార్మికులు వేరే పనులకు వెళుతున్నారు. ఇటు ఇసుక అత్యంత అవసరం అయిన కొందరు కార్మికులు నీళల్లోనుంచి అతి కష్టం మీద ఇసుక తెచ్చుకుంటున్నారు. ఇందులో కనిపిస్తున్న ఫోటో కడప జిల్లా చాగలమర్రి లోనిది. స్థానిక భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అవసరం కావడంతో పెన్నానది ఒడ్డుకు వెళ్లారు.

అయితే నదిలో నీరు పారుతుండటంతో బుట్టల సహాయంతో జల్లిపట్టి ఇసుకను అతికష్టం మీద బయటికి తీసుకొస్తున్నారు. అయితే తాము ఎంత కష్టపడినా ఎక్కువ తీయలేకపోతున్నామని.. దాని ద్వారా తమ పనులకు ఇబ్బంది కలుగుతోందని అంటున్నారు. పైగా తడిచిన ఇసుకను ఆరబెట్టి వాడుకోవాలంటే కొంత ఆలస్యం అవుతుందని వాపోతున్నారు. నదిలోనుంచి నీరు వెళ్ళిపోతే ఇసుక వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories