భర్తతో విడిపోయిన మహిళ దారుణ హత్య

భర్తతో విడిపోయిన మహిళ దారుణ హత్య
x
Highlights

విశాఖ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన అక్కయ్యపాలెంలోని మునసుబు వారి వీధిలో జరిగింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన

విశాఖ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హతమార్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన అక్కయ్యపాలెంలోని మునసుబు వారి వీధిలో జరిగింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన దేవరాపల్లి అప్పలనర్సమ్మ(38)కు సామాళ్లుతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య పలుమార్లు గొడవులు జరిగాయి. దీంతో ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అయితే ఈ సమయంలో అప్పలనర్సమ్మ జీవనం కోసం భరణంగా నెలనెలా కొంత డబ్బు పంపించాలని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో సామాళ్లు డబ్బు పంపిస్తున్నాడు. అప్పలనర్సమ్మ కూడా హెల్త్‌కేర్‌లో పనిచేస్తుంది. ఈ క్రమంలో అప్పలనర్సమ్మకు కొంతకాలంగా సామాళ్లు భరణం సరిగ్గా ఇవ్వడంలేదు. దీంతో అప్పలనరసమ్మ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భరణం చెల్లించకపోవడంతో కోర్టు సామాళ్లుకు 30 రోజుల రిమాండ్‌ విధించింది. ఇటీవలే అతను జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ నేపథ్యంలో అప్పలనర్సమ్మకు ఆమె సోదరి పద్మ ఫోన్‌ చేస్తోంది.

ఆదివారం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పద్మకు అనుమానం వచ్చి అప్పలనరసమ్మ ఇంటికి వచ్చింది. బయట తాళం వేసి ఉండడం.. లోపలి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సాయంతో ఇంటి తాళం పగలగొట్టి లోపలి వెళ్లి చూడగా.. అప్పలనర్సమ్మ రక్తపుమడుగులో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహం పక్కన లభించిన కత్తెరను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల, చెవుల మీద తీవ్ర గాయాలున్నట్టు గుర్తించారు. ఆమె మెడలో పుస్తెల తాడు తెగిపోయింది. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కిరాతకంగా హత్య చేశారని నిర్ధారించారు. మరోవైపు పద్మ మాత్రం సామాళ్లుపైనే అనుమానం వ్యక్తం చేస్తోంది. గతవారం సామాళ్లు తన అక్కకు ఫోన్‌ చేసి... నీకు ప్రతి నెలా భరణం చెల్లించలేకపోతున్నాను... నిన్ను హతమారిస్తే తలనొప్పి పోతుందని బెదిరించినట్లు తనతో చెప్పినట్టు పోలీసులకు చెప్పారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనుమానితులను విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories