పదేళ్లు సహజీవనం.. చివరకు రూ. 50 వేల కోసం దారుణం

పదేళ్లు సహజీవనం.. చివరకు రూ. 50 వేల కోసం దారుణం
x
Highlights

పదేళ్ల సహజీవనం తరువాత రూ. 50 వేల కోసం ప్రియుడిని దారుణంగా హత్యచేసిందో మహిళ. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేట ధనంబోర్డులో నివాసముంటున్న...

పదేళ్ల సహజీవనం తరువాత రూ. 50 వేల కోసం ప్రియుడిని దారుణంగా హత్యచేసిందో మహిళ. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేట ధనంబోర్డులో నివాసముంటున్న మహిళ రాదకు 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. అయితే భర్తతో విబేధాల కారణంగా పదేళ్ల కిందట విడిపోయింది. ఆ తరువాత కొద్దిరోజులకు కర్ణాటకకు చెందిన విజయకుమార్ బ్రతుకుదెరువుకోసం జగ్గయ్యపేట వచ్చాడు. ధనంబోర్డులో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఆ క్రమంలో రాదకు విజయకుమార్ తో పరిచయం ఏర్పడటంతో సహజీవం చేస్తున్నారు. రాద కు అంతకుముందే కొడుకు, కుమార్తె ఉన్నారు. కూతురికి ఇటీవల వివాహం జరిపించారు. కొడుకు ఇంటర్ వరకు చదివి మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు.

అయితే కొద్ది రోజుల క్రితం రాధ అల్లుడు.. విజయ్ వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకొన్నాడు. ఆ డబ్బు తిరిగి చెల్లించకపోవటంతో ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో శనివారం కూడా తీవ్ర వాగ్వివాదాం చోటుచేసుకుంది. కోపోద్రిక్తురాలైన రాద విజయకుమార్ ను గడ్డపలుగుతో తలమీద కొట్టి దారుణంగా హత్య చేసింది. అనంతరం పోలీసులకు దొరకకుండా రక్తపు మరకలు, వేలిముద్రలు చిక్కకుండా ఇల్లంతా కడిగేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా.. కూతురు, అల్లుడిపై దాడి చేస్తుంటే తానే హత్య చేసినట్టు నేరం అంగీకరించింది. ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories