Top
logo

ఫ్రెండ్‌ కలిసి వస్తానని వెళ్లి.. చెరువులో శవమై తేలింది

ఫ్రెండ్‌ కలిసి వస్తానని వెళ్లి.. చెరువులో శవమై తేలింది
Highlights

కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెం చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు గన్నవరానికి చెందిన గోచిపుట...

కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెం చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు గన్నవరానికి చెందిన గోచిపుట పుష్పలతగా గుర్తించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చెరువు దగ్గర ఆమె హ్యాండ్‌బ్యాగ్‌, స్కూటీని కూడా పోలీసులు గుర్తించారు. పుష్పలతకు ఏలూరుకు చెందిన అనిల్‌కుమార్‌తో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడంతో పుష్పలత గన్నవరంలో తల్లి దగ్గర ఉంటూ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే శనివారం రాత్రి ఫ్రెండ్‌ని కలిసివస్తానంటూ ఇంటి నుంచి వెళ్లిన పుష్పలత... ఉదయం మర్లపాలెం చెరువులో శవమై తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story


లైవ్ టీవి